ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు. ‘‘మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది.. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్ నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు’’ అంటూ మీనా రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రకరకాలైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమిళ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కూడా పొత్తు కుదిరింది. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఖుష్బు బీజేపీలో ఉన్నారు. మరికొందరిని పార్టీలో చేర్చుకుంటే బలం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే మీనా ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉప రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత ఆ వార్తలకు బలం చేకూరింది. త్వరలోనే ఆమె కాషాయ కండువా కప్పుకోవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
2009లో మీనా.. వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే 2022లో తీవ్ర అనారోగ్యంతో భర్త విద్యాసాగర్ చనిపోయారు. అప్పటి నుంచి మీనా.. కుమార్తెతోనే ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రాణించింది. ప్రస్తుతం రాజకీయాలపై వైపు అడుగులు వేస్తున్నారని.. ఇందులో భాగంగానే ఆమె బీజేపీలో చేరాలని భావించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.