West Bengal: బైపోల్‌లో టీఎంసీ విజయం.. రక్తపాతం సృష్టించి గెలిచారంటూ బీజేపీ విమర్శలు
- బైపోల్‌లో టీఎంసీ విజయం
- రక్తపాతం సృష్టించి గెలిచారంటూ బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో బైపోల్స్ జరిగాయి. గుజరాత్‌లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ, ఇంకొకటి ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కేరళలో కాంగ్రెస్ గెలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్ సీటును అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సందర్భంగా కలిగంజ్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
అయితే బైపోల్‌లో టీఎంసీ విజయంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ యూనిట్ సహ-ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. రక్తం చిందించకుండా టీఎంసీ ఉప ఎన్నికలో కూడా గెలవదంటూ ట్వీట్ చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో బాంబు పేలుడికి పదేళ్ల బాలిక మరణించిందని.. టీఎంసీ వేడుకలు రక్తంతో ముగుస్తాయని మాల్వియా ట్వీట్‌లో పేర్కొన్నారు. 4వ తరగతి విద్యార్థిని తమన్నా ఖాతున్ అనే చిన్న అమ్మాయి చనిపోయిందని తెలిపారు. టీఎంసీ అసలు రాజకీయ పార్టీ కాదని.. అది రాబందుల ముఠాగా అభివర్ణించారు. రక్తం చిందించకుండా గెలవలేదని తెలిపారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా ఉప ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితా? మమతా బెనర్జీ పాలనలో విజయానికి చెల్లించే ధర ఇదేనా? అంటూ మాల్వియా విమర్శించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్..
ఇక బాలిక మరణం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విచారం వ్యక్తం చేశారు. తీవ్ర విచారానికి గురైనట్లు పేర్కొన్నారు. దు:ఖ సమయంలో మా ప్రార్థనలు, ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయని పేర్కొన్నారు.
కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యదాన్ షౌకత్‌ను ప్రియాంక అభినందించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు నిలంబూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతో ఆర్యదాన్ షౌకత్… పార్టీని ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక గుజరాత్‌లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. ఇక పంజాబ్‌లో కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు సంతోషకరమైన విషయంగా తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!