కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని విపక్షాలను వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.
Amit Shah: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో స్కామ్‌లు, అవినీతి పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లంతా కటకటాల పాలవుతారని శుక్రవారం అన్నారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే,
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బండి సంజయ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటం, బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్షుడి మార్పు అంశం తెరపైకి వచ్చింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని, అలాంటి ఆలోచన…
Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఈ సమస్యను పరిష్కరించనుందుకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు సీఎం నివాసం ముందు ఆందోళన చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని కోరారు.
CM Yogi Adityanath: కాల్చిచంపబడిన గ్యాంగ్ స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేదలకు పంచారు. ఈ భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల తాళాలను లబ్ధిదారులకు అందించారు.
మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ వరంగల్ ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతే ఈ జిల్లాకు రావాలి అని అన్నారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోడీ వరంగల్ కు వస్తున్నారు.. నరేంద్ర మోడీని మా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున అడుగుతున్నాను అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కోవర్టులు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. ఈటల రాజేందర్ అనేటోడు పార్టీ మారడు.. అంగీ మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా విజయశాంతి.. తన ట్విట్టర్ అకౌంట్ లో రాజాసింగ్ సస్పెన్షన్‌పై సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని ఆమె తెలిపారు. అయితే, బండి సంజయ్ తో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నామని విజయశాంతి వెల్లడించింది.
మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే…