Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి.. పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది అధిష్టానం.. కేంద్ర బీజేపీ వర్గాల నుంచి ఈ సమాచారం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు వీర్రాజు.. నడ్డా నుంచి ఫోన్ వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయం నుంచి ఇంటికెళ్లిపోయిన ఆయన.. అధ్యక్ష స్థానం నుంచి తప్పించడంపై మీడియాతో మాట్లాడేందుకు మొదట నిరాకరించారు.. అయితే, పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.. ఇక, సాయంత్రానికి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు సోము వీర్రాజు.. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నానన్న ఆయన.. పార్టీ చెప్పిన విధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
Read Also: Sandra Venkata Veeraiah: కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే సండ్ర ఫైర్.. అప్పుడెందుకు చేయలేదు?
ఇక, రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదన్నారు వీర్రాజు.. ఇటువంటి ఫిర్యాదులకు నా శరీరం అలవాటు పడిందన్న ఆయన.. నా మీద ఫిర్యాదులు ఎవరు చేశారో, పార్టీలో నా వ్యతిరేకులు ఎవరో నాకు తెలియదని పేర్కొన్నారు. చాలా మంది పంచాయతిలో కూడా గెలవలేనని నన్ను విమర్శిస్తారు.. అలా గెలవాలనుకుంటే వేరే పార్టీలో ఉండే వాడిని అంటూ హాట్ కామెంట్లు చేశారు. 1978 నుంచి బీజేపీలో ఉన్నాను.. నా పార్టీ బీజేపీయే అని స్పష్టం చేశారు.. బీజేపీ బలోపేతం కోసం నా శాయశక్తులా పని చేశాను.. ఇప్పుడు మా అధిష్టానం నిర్ణయం వల్ల నాకు బాధ లేదు, ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.. బూత్ స్థాయిలో కమిటీలు వేసి పార్టీ కోసం పని చేశాను. నా సారథ్యంలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపిపారు.. నా సేవలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది అధిష్టానం ఇష్టం. సామాన్య కార్యకర్తగా పని చేయడానికి అయినా సిద్ధమే అన్నారు.. ఎవరి సారథ్యంలో కమిటీలు వచ్చినా.. పార్టీ కోసం అందరూ పని చేస్తారు అని వెల్లడించారు సోము వీర్రాజు.