Anurag Thakur: దేశానికి వ్యతిరేకంగా పనిచేసే భారత వ్యతిరేక శక్తులే విదేశాల్లో రాహుల్ గాంధీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. అలాంటి వారిలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు ఏం సంబంధాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
Opposition Meeting: విపక్షాల ఐక్యతపై ఈ నెల 23న పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మొత్తం 17 పార్టీలు సమావేశమయ్యాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో తెలంగాణలో పర్యటించనున్నారు. వచ్చే నెల 8న ప్రధాని వరంగల్ కు రానున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. వరంగల్ టూర్ లో భాగంగా.. అధికార కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
PhonePe: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన స్ట్రాటజీనే వాడుతోంది.