Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ చర్చనీయాంశం అయింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. ఏకంగా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెబుతూ.. బీజేపీ-శివసేన(ఏక్ నాథ్ షిండే) ప్రభుత్వంలో ఎన్సీపీ కూడా చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా.. మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు.
Read Also: Viral Video: ఢిల్లీ మెట్రోలో తోటి ప్రయాణికుడి చెంప చెల్లుమనిపించిన మహిళ.. వీడియో వైరల్..!
ఇదిలా ఉంటే తన ద్రోహం చేసిన వారు తన ఫోటోను ఉపయోగించకూడదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మంగళవారం అన్నారు. నేను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పార్టీ మాత్రమే నా ఫోటోను ఉపయోగించగలదని స్పష్టం చేశారు. నా ఫోటోను ఎవరు ఉపయోగించాలో నిర్ణయించడం తన హక్కని ఆయన అన్నారు. నా భావజాలానికి ద్రోహం చేసిన వారు మరియు నాకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నవారు నా ఛాయాచిత్రాన్ని ఉపయోగించలేరని పరోక్షంగా అజిత్ పవార్ వర్గాన్ని టార్గెట్ చేశారు.
మరోవైపు తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు 53 మందిలో 40కి పైగా మంది తమతో ఉన్నారని మరోసారి అజిత్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు జయంత్ పాటిల్ ని రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ అజిత్ పవార్ వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జయంత్ పాటిల్ అజిత్ పవార్ వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కి పిటిషన్ దాఖలు చేశారు. మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలో, కాంగ్రెస్ నేతలు మంగళవారం శరద్ పవార్ తో భేటీ అయ్యారు.