Telangana: బండి కొంప ముంచిది అదే.. కిషన్‌రెడ్డికి కలిసి వచ్చింది ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతులు మారాయి.. ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేతికి అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అయితే పార్టీని గాడిన పెట్టగలరని అధిష్ఠానం నమ్మింది. బండి సంజయ్ ఏకపక్ష పోకడలు కూడా ఆయన అధ్యక్ష పదవికి ఎసరు తెచ్చినట్టుగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక, తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు ఊహించిందే. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు.
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే తన ట్విట్టర్ అకౌంట్ లో హోదా మార్చుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి స్థానంలో బీజేపీ కార్యకర్త అని పేర్కొన్నారు. బండి సంజయ్ పై ఉన్న ప్రధాన విమర్శ నోటి దురుసు. తొందరగా మాట జారేయడం, దాన్ని వెనక్కి తీసుకోలేక.. ఇబ్బంది పడడం. ఆయనపై ఉన్న మరో ఆరోపణ నాయకత్వ లోపం. క్యాడర్ ను బాగా చూసుకుంటాడని మంచి పేరున్నా.. చుట్టూ ఉన్న నేతలను కలుపుకుని పోలేరని అంటారు. బండి సంజయ్ కు ఉన్న మరో బలహీనత కార్పోరేట్ పాలిటిక్స్ అలాగే ఢిల్లీ పాలిటిక్స్ గురించి పూర్తి ఔపాసన పట్టకపోవడం. మాస్ లీడర్ గా ఎదిగే క్రమంలో క్లాస్ ను మరిచిపోవడం వల్ల బండి సంజయ్ పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కలేదంటారు ఆ పార్టీ నాయకులు.
ఇటు కిషన్ రెడ్డికి అనుభవం, విధేయతతో పాటు వివాద రహితుడనే ట్యాగ్ కూడా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా కొన్ని సవాళ్లు అధిగమించాల్సి ఉంది కేసీఆర్ తో అనుబంధం ఉందనే వాదనను తిప్పికొట్టడంతో పాటు.. వ్యక్తిగత సత్తా ఏంటో చాటాల్సిన అవసరం కనిపిస్తోంది. బండి సంజయ్ కి మించిన దూకుడు చూపిస్తూనే.. పార్టీలో మరింత మంది నేతలు చేరేలా చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!