Kadiyam Srihari: ’మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరేసి కడియం అని చెప్పండి అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూరు లో అనుకోని విధంగా ఏదైనా మార్పు జరిగి నాకు అవకాశం వస్తే మీరు నాకు సహకరించాలని కోరారు. హనుమకొండ జిల్లా వేలేర్ మండల కేంద్రంలో రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధుల మంజూరు చేసిన ఏర్పటు చేసిన సమావేశంలో హాట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గతంలో నాకు స్టేషన్ ఘనపూర్ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారని తెలిపారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదని అన్నారు. ఎక్కడ చిన్న తప్పు చేయలేదని గుర్తు చేశారు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగర వేసుకొని మా ఎమ్మెల్యే కడియం అని చెప్పే విధంగా పని చేశానని తెలిపారు.
Read also: Iswarya Menon Latest Pics: యెల్లో డ్రెస్‌లో మెరిసిపోతున్న ఐశ్వర్య మీనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!
ఏ తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, తలవంపులు తీసుకురాలేదని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఏ పార్టీ నాయకుడు అయిన నన్ను లంగా.. దొంగ అని అంటే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాబోయే రోజుల్లో నిజాయితీగా పనిచేస్తా మీకు చెడ్డ పేరు తీసుకురానని హామీ ఇచ్చారు. మీరందరూ గొప్పగా చెప్పుకునే విధంగా నా ప్రవర్తన ఉంటుందని అన్నారు. చిల్లర పనులు నా దగ్గర ఉండవని తెలిపారు. అందరం కలిసి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. 2014 -18 ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థి గెలుపు కోసం పని చేశా అని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏమైనా మార్పులు జరిగి నాకు అవకాశం వస్తే మీరందరూ నాకు సహకరించాలని కడియం తెలిపారు.
Iswarya Menon Latest Pics: యెల్లో డ్రెస్‌లో మెరిసిపోతున్న ఐశ్వర్య మీనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!