Madhya Pradesh: నిందితుడిని విడిచిపెట్టొద్దు.. గిరిజనుడిపై మూత్రవిసర్జన ఘటనపై సీఎం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దళితుడిపై మూత్రవిసర్జన ఘటన రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అతడిని విడిచిపెట్టదని, నిందితులను శిక్షించడం ప్రతీ ఒక్కరికి నైతిక పాఠంగా మారుతుందని ఆయన అన్నారు.
Read Also: Madhya Pradesh: దారుణం.. గిరిజనుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన..!
Also Read
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
భోపాల్‌లో మీడియాతో మాట్లాడిన సిఎం చౌహాన్.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నేను ఆదేశించాను, ఇది ప్రతి ఒక్కరికీ నైతిక పాఠం కావాలి, మేము అతనిని విడిచిపెట్టము, నిందితుడికి మతం, కులం లేదా పార్టీ లేదని అన్నారు. మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఒక గిరిజన వ్యక్తిపై మూత్రవిసర్జన చేసినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో సీఎం ఆదేశాల మేరకు జాతీయ భద్రతా చట్టం కింద యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. ఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
జిల్లాలోని కుబ్రి గ్రామంలో ఈ సంఘటన జరిగింది మరియు వైరల్ వీడియోలో నిందితుడు మద్యం మత్తులో వ్యక్తి ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు చూపిస్తుంది. నిందితుడిని కుబ్రి గ్రామానికి చెందిన ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. బాధితుడిని జిల్లాలోని కరౌండి గ్రామానికి చెందిన దస్మత్ రావత్ (36)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోొ తెగ వైరల్ అయ్యాయి. సీఎం ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్లు 294, 504, సెక్షన్ 3(1) (r)(లు) కింద జిల్లాలోని బహారీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!