బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బండి సంజయ్ కు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామి ఇచ్చినట్లు తెలుస్తుంది.
Modi Hyderabad Tour: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నెల 8 న వారణాసి నుండి హైదరబాద్ కి ప్రధాని మోడీ ఉదయం 9.45 కి హాకిం పెట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ప్రాథమికంగా 200కి చేరుకోవడంతో గత 51 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక ప్రత్యేక దృశ్యం ఆవిష్కృతమైంది.
ఢిల్లీలో ప్రత్యక్షమైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బీజేపీలో పరిస్థితులపై హాట్ కామెంట్లు చేశారు.. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నేడు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 9 ఏళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నుల పై సమీక్ష చేయనున్నారు. breaking news, latest news, telugu news, Central Cabinet Meeting, pm modi, bjp
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ ఆదివారం బీజేపీ-షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో అజిత్ పవార్ తిరుగుబాటుపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఇది కొత్త కాదని, 1980లో పార్టీ పెట్టిన సమయంలో 58 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు 6 మంది మిగిలారని..
8న ఉదయమే వచ్చి గ్రౌండ్ లో ఉండాలని, కేసీఆర్ అంటే మోసం మోడీ గారు మన బాస్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ నన్ను శభాష్ అన్నారు.. నన్ను అంటే మిమ్ముల్ని అన్నట్టేనని పార్టీ శ్రేణులకు వెల్లడించారు. వరంగల్ లో మళ్ళీ శభాష్ అనాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన వ్యాఖ్యానించారు.