మైనారిటీలకు మోసం చేసేందుకు కేసీఆర్ నిన్న ఒక్క జీవో విడుదల చేసారని, ఎన్నికల ముందు ఇలాంటీ జీవో లు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్లికేషన్ ఎప్పుడు చేయాలి, అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే వివరాలు ఏమీ అందులో లేవని, అది ఒక ఫేక్ జీవో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను రంజాన్ పండుగ గిఫ్ట్‌లకే పరిమితం చేశారని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్నేళ్లు ఎందుకు ఆక్టివ్ గా లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read : Thota Trimurthulu: మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు తీసుకెళ్లిన కీలక విషయాలు
ఎన్నికల నేపథ్యంలోనే దానికి కొత్తగా డైరెక్టర్స్ ను నియమించారని, ఇచ్చిన జీవోలో గత అప్లికేషన్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదన్నారు శశిధర్ రెడ్డి. ఈ లక్ష ఎప్పుడు ఇస్తారు.. ఎలా అప్లికేషన్ చేయాలి అనేది ఆ జీవో లో ఎక్కడా పేర్కొనలేదని, దళిత బంధువలే ఎమ్మెల్యేలు ఇందులోనూ కమీషన్ తీసుకుంటారని ఆయన అన్నారు. సిక్, బౌద్ధ, జైన మతాలకు వారు మైనారిటీలు కాదా? వీళ్ళ మాటేమిటి? అని ఆయన అన్నారు. కేసీఆర్ ను నమ్మితే ముస్లిం మైనారిటీలు మోసపోవడం ఖాయమని ఆయన ఉద్ఘాటించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మోడీ విధానాలు ఉన్నాయని, కార్ స్టీరింగ్ తన చేతిలో ఉందని అసదుద్దీన్ అంటారని, మరి ముస్లిం కార్పొరేషన్ పై ఎంఐఎం ఎందుకు మాట్లాడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Kunamneni Sambasiva Rao : బీఆర్‌ఎస్ మాకు మిత్రులే.. కానీ హరీష్ ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు