ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది.
బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ సారి ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి.
రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగునుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎన్డీయే గ్రాఫ్ బాగా పెరిగిందని తెలిపాడు. దేశంలో మంచి పాలన, దేశాభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంలో 9 ఏళ్లలో దేశాభివృద్ధిని అందరూ చూస్తున్నారు.
నిజామబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ రైతు వేదిక వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. breaking news, latest news, telugu news, vemula prashanth reddy, mp arvind, bjp, brs
పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్‌ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేనట్లుంది.. అందుకే తాను విపక్షాల మహాకూటమిలో చేరే ప్రసక్తి లేదని అన్నారు. ఇక, ఇదే టైంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.