RTC Bill: ఆర్టీసి బిల్లును సిద్ధం చేసిన సర్కార్.. ఆమోదం తెలుపని గవర్నర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Bill: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపలేదు..! దీంతో ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపింది. అయితే ఈ బిల్లుకు రాజ్‌భవన్ నుంచి ఆమోదం లభించలేదు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నెల 31న జరిగిన తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ మేరకు ఈ నెల 1న బిల్లు రూపొందించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అది మనీ బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే రాజ్‌భవన్ నుంచి బిల్లుకు ఇంకా ఆమోదం లభించలేదు. ఈ బిల్లుకు రాజ్‌భవన్ ఆమోదం లభిస్తే ఈరోజు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రాజ్‌భవన్ నుంచి అనుమతి రాకపోవడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు.
Read also: Andy Flower: ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్.. ఇక కప్పు ఖాయం!
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు పొడిగించవచ్చు. రేపటిలోగా రాజ్‌భవన్ నుంచి ఆమోదం లభిస్తే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులతో పాటు మరో నాలుగు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన 43 వేల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత నెల 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లును అధికారులు ఈ నెల 1న రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే ఈ బిల్లుపై రాజ్‌భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!