వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తనపై వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజల ఓట్లు సంపాదించుకోలేరని.. అధిక మెజార్టీతో గెలిచిన తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: President Of India: టైమిచ్చిన రాష్ట్రపతి.. రేపు ఉదయం కలవనున్న ఇండియా ఎంపీలు
మమ్మల్ని కులం చూసి కాదని, గుణం చూసి గెలిపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. అన్ని వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఏనాడు అహంకారపూరితంగా వ్యవహరించలేదని.. గతంలోనూ తనపై అనేక ఆరోపణలు చేశారని మంత్రి ఆగ్రహ వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు ఎదిగితే కొందరు సహించలేకపోతున్నారు.. కేసీఆర్ ఉన్నంత వరకు మాకేం కాదని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో అధికారంలోకి కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పి.. ఇప్పుడు పురుషులకు మాత్రమేనని అంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
Read Also: Andhrapradesh: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం
అలాగే.. నామినేషన్ అఫిడవిట్ లో ట్యాంపరింగ్ చేశారంటూ మరి కొందరు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి నాలుగు నామినేషన్ లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది.. నా అఫిడవిట్ లో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని గతంలోనే ఈసీ నివేదిక ఇచ్చింది అని ఆయన తెలిపారు. ఎదైనా ప్రైవేటు ఫిర్యాదు వస్తే.. కోర్టు విచారణ చేయమని చెబుతుంది.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.. కాబట్టి నేను దానిపై ఎక్కువ మాట్లాడను.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు నా మీద కుట్ర చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.