తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఎన్నికల్లో ముందుకు ఎలా వెళ్లాలన్న దానిపై కారు పార్టీ దృష్టి సారించింది. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.. లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయింది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు రేపటి(గురువారం) నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాల్లో విపక్షాలపై దాడి చేసేందుకు అధికార పార్టీ నేతలు రెడీ అవుతున్నారు.
Read Also: New Toll System: ఇకపై టోల్ గేట్ దగ్గర ఆగక్కర లేదు.. త్వరలో కొత్త టోల్ వ్యవస్థ
తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ రెడీ చేసుకుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే టార్గెట్‌గా ముందుకు సాగుతుంది. ఇలాంటి చాలా అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అధికార పార్టీకి ఇదే చివరి అసెంబ్లీ సమావేశం. ఎందుకంటే సెప్టెంబరు రెండు లేదా మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు 18 తర్వాత ఏ రోజైనా బీఆర్ఎస్ తొలి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు అంటున్నారు.
Read Also: Odisha Train Tragedy: గుర్తించలేని స్థితిలో ఇంకా 29 మృతదేహాలు.. ఏం చేయనున్నారు..?
తొలి జాబితాలోనే 85 నుంచి 90 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించే ఛాన్స్ ఉంది. తొలి విడత ప్రకటించిన తర్వాత మిగిలిన నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగి రైతులు నష్టపోవడంపై ప్రస్తుతం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే టాఫిక్ పై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరుగనుంది. ఇదే అంశంపై ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి చేసేందుకు ఛాన్స్ ఉంది. ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకుని.. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేయాలని యోచిస్తోంది. ఇంతలా వర్షాలు కురిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థికసాయం పైనా వివరాలను రెడీ చేస్తోంది. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చగా జరిగే అవకాశం ఉంది.