108 Employees: 108 ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు పెంచనున్న సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
108 Employees: 108 ఉద్యోగులకు శుభవార్త అందించిన సర్కార్. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు శ్లాబులుగా పెంచుతున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా కంటే పెద్ద రోగం వచ్చినా రాష్ట్రం మనుగడ సాగిస్తుందని అన్నారు. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో 466 కొత్త వాహనాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్ష మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, ఇప్పుడు 75 వేల మందికి ఒక 108 వాహనం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. వాహనాలకు నిధులు అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మఒడిని విడుదల చేశారని వెల్లడించారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
Read also: Hi Nanna: మృణాల్ మరోసారి సీతని గుర్తు చేసింది…
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తన మంత్రిత్వ శాఖను ప్రశంసించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కుటుంబ పెద్దకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ విభాగం 70 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు మూతపడ్డాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు అమ్మఒడి వాహనాల ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఆశా వర్కర్ల సెల్‌ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ తెలిపారు. వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంబులెన్స్‌లను డైనమిక్‌గా ఉంచాలనుకుంటున్నామని వెల్లడించారు. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు శ్లాబులుగా పెంచుతామన్నారు.
Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!