Mahua Moitra: క్యాష్ ఫర్ క్వేరీ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా రేపు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నారు. వీటిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్ సభ స్పీకర్ కి లేఖ రాశారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి ఆమె పార్లమెంట్ ఐడీ లాగిన్ అయిందని ఆరోపిస్తూ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు.
మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ కమిటీ ముందు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంట్లో మహువా మోయిత్రా తన నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వివాదం పెద్దదైంది. మరోవైపు టీఎంసీ కూడా ఈ అంశంపై పెద్దగా స్పందించడం లేదు.
Read Also: Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
ఇదిలా ఉంటే మహువా మోయిత్రా రేపు ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. కమిటీ ముందున్న సాక్ష్యాలు, మూడు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రశ్నించనున్నారు. హోం, ఇన్ఫర్మేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నివేదికలు కమిటీ ముందు ఉన్నాయి. అక్టోబర్ 26న జరిగిన సమావేశం తర్వాత ఎథిక్స్ కమిటీ ఈ మూడు శాఖలను సమాచారం కోరింది. ఆమె లాగిన్ వివరాలు, ఐపీ అడ్రస్ వివరాలను కోరింది.
దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని అదానీ గ్రూపు ద్వారా ప్రధాని మోడీని టార్గెట్ చేయాలని అనుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె 60 ప్రశ్నలు అడిగితే అందులో 51 ప్రశ్నలు అదానీ గ్రూపుపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి మహువా మోయిత్రా తన 47 సార్లు లాగిన్ అయ్యారని, వ్యాపారవేత్తకు సంబంధించిన ప్రదేశాల నుంచి లాగిన్ అయినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ వార్త నిజమైతే దేశంలోని ఎంపీలంతా మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని ట్వీట్ చేశారు.