K.Laxman: బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తోందని కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాహుల్ తెలంగాణ ఎన్నికల ప్రచారం లో బీజేపీ, బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలను కించ పరుస్తూ రాహుల్ మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏనాడూ బీసీలను ముఖ్యమంత్రి చెయ్యలేదని గుర్తు చేశారు. బీసీలను కాంగ్రెస్ ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తోందన్నారు. బీసీలు సీఎం అవడం ఓర్వలెక పోతున్నారు రాహుల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోని బీసీలు వారి సత్తా ఏంటో చూపెట్టాలన్నారు. కాంగ్రెస్ పెట్టుబడి దారులకు అండగా పనిచేస్తోందన్నారు. బీసీ ల ఆత్మ గౌరవంతో కూడిన ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు అయిన విషయం రాహుల్ మరిచి పోయారని గుర్తు చేశారు. బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. నిర్లక్ష్యం చేసిన వర్గాలకు మోడి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. బీసీలు అంటే ఎందుకింత చులకన, అహంకారం అన్నారు.
మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందన్నారు. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే. అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్ అన్నారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని మండిపడ్డారు. బీసీలను అవమానించడమే. మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు.
Trisha: అందమే అసూయ పడేలా ఉంది కదా మావా…