మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబ్బండ వర్గాల మద్దతు అందెల శ్రీరాములుకు లభిస్తుంది. ఈ క్రమంలో.. అందెల శ్రీరాములుకు ఆటో యూనియన్లు మద్దతు పలికాయి. చలాన్లతో మా పొట్ట కొడుతున్నారని ఆటో డ్రైవర్లు అందెలకు వివరించారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ అధికారంలోకి రాగానే ఆటోవాలాలకు ఉచితంగా PM ప్రమాదబీమా అందిస్తానని చెప్పారు.
తెలంగాణలో గెలిచే ఒకటో రెండో సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందా హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో బీజేపీ ఒకే సీటు గెలిచిందని, ఈసారి కూడా ఒక్క సీటు మాత్రమే వస్తుందన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీజేపోడు బావి దగ్గర మీటర్ పెడుతా అంటున్నాడు.. కాంగ్రెసోడు మూడు గంటల…
కేసీఆర్‌ను గెలిపిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. బుధవారం ఆమె జోగులాంబ గద్వాల్ జిల్లా అలాంపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ పదేళ్లు యువత, నిరుద్యోగులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. పదేళ్లు యావత్ తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేసి నిరుపేదల భూములను లాకున్నారని వాపోయారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి…
కుటుంబ పెత్తనం లేనటువంటి పార్టీ అధికారంలోకి రావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం బీజేపీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి, అస్థిరత ఉంటుందని, బీఆర్ఎస్ కుటుంబ పెత్తనం పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానమని.. ధర్మం, దేశం బీజేపీ విధానమన్నారు. ఉద్యోగులకు ఒకటో…
వరంగల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే…
Rivaba Jadeja: భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్‌ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. దీంతో భారత ఆటగాళ్లే కాదు యావత్ దేశం కూడా బాధపడింది. ఇండియా ఓటమి అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ప్రతిపక్షాలు దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా విమర్శిస్తున్నాయి, అయితే ప్రధాని డ్రెస్సింగ్ రూం సందర్శనపై క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా…
Harish Rao Counters to Nirmala Sitharaman Comments: బీజేపీ నేత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వంను ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టలేదనే తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేదని అనడం ద్వారా బీజేపీ బండారాన్ని నిర్మలమ్మ స్వయంగా బయటపెట్టారన్నారు. సీఎం కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వమనే విషయం కేంద్రమంత్రి వ్యాఖ్యలతో…
అందెల శ్రీరాములు యాదవ్ ని కలిసి మద్దతు ప్రకటించింది నిరుద్యోగ జేఏసీ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు అంతా బీజేపీకి సపోర్ట్ చేసి.. అందెల శ్రీరాములు యాదవ్ కి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు నిరుద్యోగ జేఏసీ నేతలు.