ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు. అందులో భాగంగానే.. కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుండి విముక్తి కోరుతున్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు. తాను ఇచ్చే మాటలే గ్యారంటీ అని అన్నారు. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరం అవుతాయో అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారన్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని ఆరోపించారు.
Wife Kills Husband: బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఖరీఫ్ లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొంటాం.. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఏళ్ల తరబడి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వారి అక్రమాల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ సీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు… వారి కుటుంబ పాలన, అవినీతి పాలన ఇక సాగదు అనేలా వారికి గుణపాఠం చెప్పాలని ప్రధాని మోదీ అక్కడి ప్రజలకు సూచించారు.
Tamarind : చింతపండు ఎక్కువగా తింటున్నారా..? ఇదొక్కసారి చూడండి..
వారిద్దరు రెండు చోట్ల పోటీ చేస్తున్నారని.. అక్కడ ఓడిపోతామనే భయంతో కామారెడ్డి వచ్చారని ప్రధాని విమర్శించారు. బీఆరెస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. డిసెంబర్ 3న ప్రజలు కేసీఆర్ ను తరిమేసినట్లుగా తీర్పు రానుందని అన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో తమకు 300 ఎంపీలు ఉన్నారని.. తాము బలహీనంగా ఉన్నపుడు మీరు అండగా ఉన్నారని ప్రధాని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తే.. మేము మీ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.