సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2021లో విగ్రహ ప్రతిష్టపన చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అమిత్ షా అన్నారు. 370 ఆర్టికల్ ని కాంగ్రెస్ అడ్డుకుంది.. అయినా మోడీ సర్కారు ఆర్టికల్ ని రద్దు చేసిందని తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్ట్రైక్ చేసి వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు.
karisma Kapoor : లైవ్ షోలో ఏడ్చేసిన కరిష్మా కపూర్..కంటతడి పెట్టిస్తున్న వీడియో..
కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ నట్టేట ముంచారు.. నిరుద్యోగులకు భృతి ఏమైందని ప్రశ్నించారు. 2.50 కోట్ల మందికి కేంద్రం ఉద్యోగాలు ఇచ్చినా, ఎక్కడ పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీకులు అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టేనని అమిత్ షా తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారన్నారు.
Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు పెంచారని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఓట్లు అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా.. ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామన్నారు. తొలి క్యాబినెట్ లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తామని చెప్పారు. రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తాం.. ప్రజారోగ్యం కోసం 10 లక్షల భీమా కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా.. ఒక్క ఓటు పటాన్ చెరు బీజేపీ అభ్యర్థికి.. మరో ఓటు మోడీకి వేయండని అమిత్ షా తెలిపారు.