Vijaya Sankalpa Sabha: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కొరకు హుడా ట్రక్ పార్క్‌లో రేపు జరగబోయే విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి వెల్లడించారు.
Also Read: PM Modi security breach: ప్రధాని భద్రతా ఉల్లంఘన.. రెండేళ్ల తర్వాత పోలీస్ అధికారి సస్పెండ్..
నేడు కూకట్‌పల్లిలోని సభ స్థలాన్ని పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జనసేన, బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో సభను విజయవంతం చేయాలని కోరారు. విజయ సంకల్ప సభతో తమ సత్తా ఏమిటో బీఆర్ఎస్ పార్టీకి చూపించాలని పిలుపునిచ్చారు. ఈసారి కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన వెల్లడించారు.