తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు. వందలాదిమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది.. ప్రజల ఆకాంక్షలమేరకే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిందని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో అప్పుల కుప్పగా మారిందని అన్నారు.
YS Sharmila: కేసీఆర్‌లాంటి అహంకార సీఎం చరిత్రలో లేరు
కాంగ్రెస్ 6 గ్యారంటీలు కేవలం హామీలు కావు.. ప్రభత్వమేర్పడ్డాక మొదటి మంత్రిమండలి సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. మహిళలకు, రైతులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. మహిళల్లేకుండా సమాజాన్ని ఊహించలేమన్నారు. నేడు రూ.1200గా ఉన్న గ్యాస్ సిలెండర్.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే రూ.500కే ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా.. మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ. వివాహితలకు రూ.2500, వృధ్ధులకు ప్రతినెల పించను రూ. 4000 ఇస్తామని తెలిపారు. తెలంగాణాలో రైతు ఆత్మహత్యలను చూడటానికి మేము సిద్ధంగా లేమన్నారు రాహుల్ గాంధీ.
Dhruva Natchathiram: ‘ధ్రువ నక్షత్రం’ సినిమా కష్టాలు తీరేది ఆరోజే!
రైతులు భయంగా జీవించటం తాము ఇష్టపడట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.15000, రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని తెలిపారు. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలే, కాలానుగుణంగా కొంత మొత్తం పెంచామని చెప్పారు. తెలంగాణ కోసం అమరులైన ప్రతి ఒక్కరి కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలాలు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. అంతేకాకుండా.. యువ వికాసం కింద, విద్యా భరోస కింద 5 లక్షల సహాయం.. చేయూత కింద వృద్ధులందరికి, వితంతువు, వికలాంగులకు నెలకు 4వేలు.. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స ఖర్చులు ఇస్తామని పేర్కొన్నారు. ఇవి కేవలం పథకాలు కావు, మొదటి మంత్రిమండలిలోనే చట్టాలుగా మారుస్తామని చెప్పారు.
India-Canada: “భారత్‌ని దోషిగా ఎలా నిర్ధారిస్తారు..?” నిజ్జర్ హత్యపై భారత రాయబారి వ్యాఖ్యలు..
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ నాటినుండి దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణగా మారనుందని రాహుల్ గాంధీ అన్నారు. మీ దగ్గరనుండి కేసీఆర్ దోచుకున్న ధనాన్ని ప్రజలకు చేరుస్తామని తెలిపారు.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు. మోదీ మిత్రులు కేసీఆర్, ఓవైసీ అని అన్నారు. మోదీ హయాంలోని ప్రతీ బిల్లుకు కేసీఆర్ మద్దతు ఉందని పేర్కొన్నారు. తాను నరేంద్రమోదీతో పోరాడతానని.. తాను తన పోరాటాన్ని ఆపననని, మోదీ ఆలోచనా విధానం మారనంతవరకు తాను పోరాడుతూనే ఉంటానని రాహుల్ తెలిపారు. నాకు దేశప్రజలందరూ కుటుంబీకులే.. దేశంలోని ప్రతీ ఇల్లూ నాదేనని అన్నారు. కేసీఆర్ కు సీఎం పదవి అవసరం.. కేసీఆర్ కుర్చీ రిమోట్ మోదీ చేతిలో ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడనుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.