ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రయాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరు పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆమె ప్రసంగించారు. ‘ఇందిరగాంధీకి తెలంగాణ అంటే చాలా ఇష్టం. చనిపోయిన ఇన్నేళ్లకు కూడా ఇందీరా గాంధీ మీ అందరికి గుర్తున్నారంటే ఆమె చేసిన పాలనే. భూమి.. నీళూ.. నీధుల కోసం పోరాటం చేసి అభివృద్ధి చేశారు కాబట్టే మిరందరూ ఆమెను గుర్తుపెట్టుకున్నారు. నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి.. ఎదిరించాలి. కేసిఆర్ పది సంవత్సరాల నుండి పాలిస్తూ ఫాంహౌస్ కే పరిమితం అన్నట్టుగా పాలించాడు. అలాంటి నాయకుడిని పదవి నుంచి దింపాలా? వద్దా? ప్రజస్వామ్యంలో ముఖ్యమైన శక్తులు మీరే.. మీ ఓటే మీ శక్తి.. ఎవ్వరికి బడితే వారికి ఓటు వెయ్యకండి. డబ్బులు ఆశ చూపి స్కిం తీసుకొచ్చి ఆశ పెడతారు.. వారితో జాగ్రత్త. తెలంగాణ బిడ్డలు అలాంటి వాటికి దూరంగా ఉండాలి’ అని ఆమె పిలుపు నిచ్చారు.
Also Read: Lakshmareddy: కాంగ్రెసోళ్లకి పదవుల మీద యావ తప్ప.. జనాల మీద ప్రేమ ఉండదు.
తెలంగాణ మీ చెమట నెత్తురితో తడిచిన నేల
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘కేసిఆర్ పాలనలో ఎలాంటి సమష్యలు పరిష్కారం కాలేదు. రైతు రుణామాఫీ జరిగిందా? సింగరేణి ప్రవేటికరణ చేస్తున్నరన్న విషయం మీకు తెలుసా? సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్ ఎప్పటికి సమర్థించదు.ఈ ఎలక్షన్‌లో సరైనా నిర్ణయం ప్రజలు తీసుకోవాలి. ఓట్ల కోసం చాల మంది నేతలు వస్తారు వారితో జాగ్రత్త. సరైనా ఆలోచన చేసి మంచి నాయకులను ఎన్నుకొండి. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. విధ్యార్ధులు, నిరుద్యోగుల త్యాగమే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం. ఈ తెలంగాణ భూమి మీ చెమట నెత్తురితో తడిచిన నేల. మీ అందరి ముఖ్యమైన బాధ్యత మీ ఓటు. మీరు వేసే ఓటే ఐదు సంవత్సరాల అభివృద్ధిపై అధారపడి ఉంటుంది. పది సంవత్సరాల కేసిఆర్ కుటుంబ పాలన చూశారు కదా.. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గ్రామాల వరకు అవినీతి జరిగింది.
Also Read: Karachi Fire Accident: షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి!
పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్‌ది.కేసిఆర్ ప్రభుత్వం నిరోద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం. తెలంగాణలో నిత్యవసర సరుకులు కొనాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయ్యాయి. ఈ ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు ప్రజలకు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రుణామాఫీ చేశాం. రాజస్థాన్‌లో మహిళల కోసం మంచి పధకాలు తీసుకుచ్చాం. చతీష్‌ఘడ్‌లో మహిళలకు ఉపాది కల్పించాం. దేశంలో రెండు రకాల పార్టీలు మీ సంపద దొచుకొనే పార్టీలు అయితే కాంగ్రెస్ మీ జేబులోకి డబ్బులు వేసే పార్టీ. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే, మోదీకి కేసీఆర్ తమ్ముడులా ఉంటాడు.. కేంద్రంలో అవసరం అయితే తమ్ముడు కేసిఆర్‌కు మోదీ సపోర్టు ఇస్తారు. ఇలాంటి నాయకుల మనకు కావాలా?’ అని ప్రశ్నించారు.