నిర్మల్ జిల్లాలోని చించోలి - బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
వనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన టీఎస్ ఆర్టీసీ టీఎంయూ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడండి.. బీఆర్ఎస్ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారు..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికలంటే breaking news, latest news, telugu news, harish rao, bjp, congress, brs,
Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.
కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామాన్ ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె మంగళవారం తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆమె అక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లోటు బడ్జెట్కు తీసుకువచ్చిందన్నారు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో తెలంగాణలో ధనిక రాష్ట్రమని, తొమ్మిదేళ్ల పాలనలో…
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, పీఎం మోడీని టార్గెట్ చేశారు. భారత్ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు.
Bndi Sanjay: తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.