IT Raids: శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించింది. ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి.
ఐటీ శాఖ వర్గాల ప్రకారం.. ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన పలు ప్రదేశాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సంబల్ పూర్, బోలంగీర్, తితిలాగఢ్, బౌధ్, సుందర్‌ఘర్, రూర్కెలా, భువనేశ్వర్‌లలో దాడులు జరుగుతున్నాయి. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ అధికారులు నగదు లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్స్, 30 మందికి పైగా అధికారులను వినియోగిస్తున్నారు.
Read Also: Rajinikanth: వరదల్లో మునిగిన రజనీకాంత్ ఇల్లు.. వీడియో వైరల్
భువనేశ్వర్ లో జరుగుతున్న దాడులను ఐటీ డైరెక్టర్ సంజయ్ బహదూర్ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ కంపెనీలు నికర లాభాలను తక్కువగా చేపడంతో పాటు బ్యాలెన్స్ షీట్స్‌లో కొన్ని అనుమానపు లావాదేవీలు చేసినట్లు ఐటీ అధికారులు ధృవీకరించారు. ఈ వ్యవహారంపై ఈడీ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జార్ఖండ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ దీపక్ ప్రకాష్ ఎక్స్ ద్వారా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో ఇతర కాంగ్రెస్ ఎంపీలకు తప్పకుండా ప్రమేయం ఉంటుందని ఆరోపించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.