వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని ప్రధాని మోడీ జెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్రమంలో.. సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీలో ఆరేళ్లలో 50 లక్షల మందికి ఇల్లు కట్టించాము.. కానీ తెలంగాణలో 2 లక్షల ఇల్లు కూడా కట్టలేదన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద 35 లక్షల మందికి ఎకరానికి 6 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: ఇందిరమ్మ రాజ్యం కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది.. మండలిలో సీఎం..
ఎరువుల సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాజకీయాలపై ఇప్పుడు మాట్లాడదల్చుకోలేదు.. గతంలో ఉన్న ప్రభుత్వం అయుష్మాన్ భారత్, గృహ యోజన పథకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఓ ఇంటి నిర్మాణ ఖర్చు కోసం లక్షా 50 వేల రూపాయలు ఇస్తుంది.. అయుష్మాన్ భారత్ పథకం గత ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కరోనాతో అనేక మంది చనిపోయారని అన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు.
Read Also: Bhagyashri Borse: మాస్ మహారాజా పక్కన యానిమల్ భామ కాదు.. ఈమే హీరోయిన్!