తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనపై బీజేపీ సమావేశం అయింది. ఈ పథకం కింద ప్రతి నియోజక వర్గంలో వెయ్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన వారికి ఈ పథకం లబ్ది కలిగేలా చూడాలని.. వారితో దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. ఇక, ఈ పథకం కింద లబ్ధి దారులకు మూడు లక్షల వరకు సబ్సిడీ తో కూడిన లోన్ తీసుకునే విధంగా ప్రొత్సహించాలన్నారు. రేపటి నుంచే లబ్దిదారులతో దరఖాస్తు చేయించాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Minister Seethakka: మిషన్ భగీరథ, స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష..
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఇంచార్జులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీలో వ్యక్తి కేంద్రీకృతంగా పోస్టులు పెడితే వేటు తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోని నేతలను కించ పరుస్తూ పోస్టింగ్స్ పెట్టితే ఉపేక్షించేది లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అన్ని గమనిస్తుంది.. ఎవరు పెడుతున్నారో అనేది పార్టీకి తెలుసు.. పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవు.. సోషల్ మీడియాను వ్యక్తిగతంగా కాకుండా పార్టీ కోసం ఉపయోగించండి అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సూచనలు చేశారు.