BJP: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాల విమర్శలకు అధికార బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయంటూ మండిపడింది. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో వారికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
Read Also: Indian Navy : ఓడను హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. తిప్పికొట్టిన భారత నావికాదళం
జిన్నా ఆత్మ ఓవైసీలోకి ప్రవేశించిందని, అందుకే ఆయన కేవలం ముస్లింలను మాత్రమే చూడగలుగుతున్నారని, నేరస్తుల్లో హిందూ-ముస్లిం కోణాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, ఉగ్రవాదులకు విశ్వాసాలు, కులం, మతం పట్టింపు లేదని కేంద్రమంత్రి అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఉగ్రవాదుల మతాన్ని పరగణలోకి తీసుకోకుండా ఉగ్రవాదులను, ఉగ్రవాదులగానే చూస్తుందని అన్నారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు పాల్పడితే ఏం జరిగేదని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాలు ఉగ్రవాదుల్ని హిందూ-ముస్లింలుగా చూస్తోందని ఆయన మండిపడ్డారు. వీటన్నింటికి అమిత్ షా పారిపోయే వారు కాదు.. ఆయన దృఢం సకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని అన్నారు.