Devendra Fadnavis: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఫడ్నవీస్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ‘ రాహుల్ గాంధీ బీజేపీకి దేవుడు ఇచ్చిన వరం.. ప్రతిపక్ష నేత ఇలాగే ఉంటే మనం అదృష్టవంతులుగా భావించాలి’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేత ఉండటం బీజేపీకి అదృష్టాన్ని తీసుకువస్తోందని అన్నారు.
Read Also: Bussiness Idea : మహిళల కోసం అదిరిపోయే బిజినెస్.. రోజుకు రెండు వేలు సంపాదించుకొనే అవకాశం..
కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల గురించి ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన గురించి మాత్రమే ఆలోచించిందని, పార్టీలు, సంస్థల ప్రాముఖ్యత తగ్గింది, ఆ పార్టీలో కేవలం లీడర్లు మాత్రమే బాగుపడ్డారు, కార్యకర్తల గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
బీజేపపీలో అత్యంత విధేయులు ఎవరైనా ఉన్నారా..? అంటే అది మా కార్యకర్తలే అని, సాధారణ కార్యకర్త కన్నా ఎవరూ ఎక్కువ కారని, ఇది బీజేపీలోనే సాధ్యమంటూ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహా విజయ్ 2024 ప్రాముఖ్యత, లక్ష్యాలను చెబుతూ.. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు దృష్టిపెట్టాలని కోరారు. పక్కన పెట్టిన వారికి పార్టీకి దోహడపడేలా పదవులు ఇస్తామని అన్నారు. మరోసారి నరేంద్రమోడీని ప్రధాని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.