Visakha MP Seat Competition in BJP: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం…
BJP : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల్లో టికెట్ పొందిన అభ్యర్థుల్లో హైదరాబాద్, తెలంగాణకు చెందిన మాధవి లత కూడా ఉన్నారు.
సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి.. వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది, గాజువాకకు ఎందుకు వెళ్లారు? అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పు లేకుండా ఉన్నాడని, సొంతంగా రాలేక అందర్నీ కలుపుకొని ఎన్నికలకు…
ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలని, కండువా…
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్ని్కల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హిందూపురం నుంచి స్వామీజీగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే మాత్రం అభివృద్ధి బాటలో నడిపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలు.. ఎంపీ సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని…
BJP: బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, రాజీవ్ చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింథియా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి ప్రముఖ నేతలు తొలి లిస్టులోనే ఉన్నారు.
BJP 1st List: లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు 34 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా లోక్సభ బరిలో నిలిచారు. తొలి జాబితాలో 28మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195…
BJP: బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రి పనిచేశారు, హజారీబాగ్కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు.