అదానీ, అంబానీ ఆస్తిని కూడా సగటు భారత పౌరునితో పోల్చితే ఎలా..? అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అట్లా చూసి సగటు పౌరుని జీవన ప్రమాణాలు పెరిగాయని ఎట్లా అంటారు అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అంతేకాకుండా.. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే ఉపేంద్ర సింగ్ రావత్ పేరు ఉంది. అయితే.. తాను ఎన్నికల్లో పోటీ చేయనని ట్వీట్ లో తెలిపారు. తనకు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై స్పందిస్తూ.. వైరల్ అయిన వీడియో ఎడిట్ చేశారని.. డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను తయారు చేసినట్లు…
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమయమే చెబుతుందని బీజేపీకి చెందిన పవన్ సింగ్ అన్నారు. అసన్సోల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిని పవన్ కలిశారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నిరాకరించిన పవన్ సింగ్.. సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..…
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు చక చక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారు.
ఏపీలో బీజేపీ రెండు రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని కీలక నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు.
ఆ గులాబీ నేతను కాషాయం రా… కదలి రా… అంటోందా? ఆయనకు కూడా లోలోపల వెళ్ళాలని పీకుతున్నా…. చల్లకొచ్చి ముంత దాచే వైఖరి ప్రదర్శిస్తున్నారా? కేవలం పార్టీ మారడమే కాదు.. ఏకంగా ఎంపీ టిక్కెట్ ఆఫర్ కూడా ఉన్న ఆ నాయకుడు ఎవరు? ఆయనకు, తెలంగాణ బీజేపీ నాయకత్వానికి మధ్య జరుగుతున్న దోబూచులాట ఏంటి?నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్త అస్త్రాలకు పదును పెడుతోందట బీజేపీ. సొంత పార్టీ నేతలతోపాటు పక్క పార్టీల్లోని వాళ్ళ మీద…
Lalu Prasad Yadav: బీహార్ పాట్నా వేదికగా ఈ రోజు రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హిందువు కాదని అన్నారు.
Harsh Vardhan: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత డాక్టర్ హర్ష వర్ధన్ తన మూడు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. నిన్న బీజేపీ విడుదల చేసిన 195 ఎంపీ అభ్యర్థుల జాబితాలో హర్ష్ వర్ధన్ పేరు లేదు. ప్రస్తుతం ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన స్థానాన్ని ప్రవీణ్ ఖండేల్ వాల్కి కేటాయించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 69 ఏళ్ల హర్ష్ వర్ధన్ నేనెప్పుడూ…
Pawan Singh: బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు తొలి జాబితా కొన్ని వివాదాలకు కారణమవుతోంది. విద్వేష వ్యాఖ్యలు చేసే పలువురు నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్యంగా టార్గెట్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ పార్టీకి దెబ్బపడింది. భోజ్‌పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్‌ని బెంగాల్ అసన్సోల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికిగా నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది సమయానికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు పవన్ సింగ్ టార్గెట్‌గా…