ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. ఈ తరుణంలో చివరి నిమిషంలో నంద్యాల పర్యటన రద్దు చేసుకున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఢిల్లీ బాట పట్టారు..
లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీనీ ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.. కానీ యావత్ భారత దేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పని చేస్తున్నాడు అని తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తున్నాడు..
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఆర్జేడీ అధినేత నితీష్కుమార్ వెళ్లారు. అంతేకాదు.. బీజేపీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు.
India Not A Nation: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజా.. తాజాగా ‘‘ఇండియా ఒక దేశం కాదు’’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేడు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లడటం ప్రారంభించారు. మీ ఉత్సహం చూస్తుంటే నాకు బీజేపీ గెలుస్తుందని నమ్మకం కలుగుతుందన్నారు. మోడీ గ్యారెంటీ అంటే పూర్తి అయ్యే గ్యారెంటీ (తెలుగులో) అన్నారు. మోడీ ఎం చెబితే అది చేసి చూపిస్తాడని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని, ఆర్టికల్…
దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఇవాళ ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వలేదని, మోడీ ఎందుకు వచ్చినట్టు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. 4 మంది ఎమ్మెల్యేలను ప్రజలను గెలిపిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఖర్చు…
యూపీఏ హయాంలోని పాలనకు, నరేంద్ర మోడీ సర్కారుకు మధ్య ఉన్న తేడాపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.
భారత్లో నిరుద్యోగం పాకిస్థాన్లో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఎదురుదాడి చేసింది. దీనితో పాటు, పొరుగు దేశానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్న కూడా ఆ పార్టీ లేవనెత్తింది.