Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎతో కలిసి ఉంటానని, ఎక్కడికి వెళ్లనని నితీస్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ప్రధాని మోడీ చిరునవ్వు చిందించారు. బీహార్ ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగం సభలో నితీష్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఇంతకముందు బీహార్ వచ్చారు, కానీ నేను మీతో లేను, ఇప్పుడు నేను మీతో ఉన్నారు, నేను ఇక ఎక్కడి…
Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.
Farmers Protest : ఢిల్లీకి రైతుల పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. రైతు నేతలు ఇప్పుడు మార్చి 3న అంటే ఆదివారం రోజున ప్లాన్ చేసి కొత్త వ్యూహాన్ని ప్రకటిస్తారు.
Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ…
హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal pradesh) రాజకీయ సంక్షోభం మరింత పీక్ స్టేజ్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఊహించని పరిణామాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Shivraj Singh Chouhan: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే 100 మందితో తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ కొలిక్కి రాకపోవడంతో, వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పక్కాగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని బీజేపీ లోక్‌సభ బరిలో నిలుపనున్నట్లు తెలుస్తోంది.