టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. 3 రోజుల నుండి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
Read Also: Pawan Kalyan: ఎంపీగా పోటీ చేయనున్న పవన్ కల్యాణ్.. బీజేపీ పెద్దల మేరకు బరిలోకి
ఎంత మంది కలిసొచ్చినా జగన్ ఓడించడం కలే అని ఎంపీ కేశినేని నాని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి 175/175 సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో చంద్రబాబు ప్రధాని అపాయింట్మెంట్ కోసం కాదని.. అమిత్ షా కోసం పడిగాపులు కాశారని అన్నారు. జగన్ దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందని దుయ్యబట్టారు. మరోవైపు.. జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ అని ఆరోపించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని కేశినేని నాని తెలిపారు.
Read Also: Bengaluru Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి కొత్త ఫోటోలను రిలీజ్ చేసిన ఎన్ఐఏ..