BJP: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ రోజు 39 మందితో తొలిజాబితాను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి కేరళ లోని వయనాడ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ గురించి కాంగ్రెస్ రహస్యంగా వ్యవహరిస్తోంది. సోనియా గాంధీ ఈ సారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.
ఇదిలా ఉంటే మరోసారి రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటం కన్ఫామ్ కావడంతో అమేథీ విషయం ప్రస్తావించకపోవడం గురించి బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయా దీనిపై స్పందిస్తూ.. అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపడానికి కాంగ్రెస్ భయపడింది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయరా.? మీరు భయపడుతున్నారా..?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Also: China: భారత సైన్యం మోహరింపుపై చైనా చిలక పలుకులు..
కాంగ్రెస్ ఉత్తర్‌ప్రదేశ్ అభ్యర్థులను దాటవేసి దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. 2019లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి ఆయన ఇక్కడ వరసగా మూడుసార్లు గెలిచారు.
ప్రస్తుతానికి కాంగ్రెస్ మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను వదిలిపెట్టింది. ఈ రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్‌పై మిత్రపక్షాలతో చర్చిస్తోంది. మరోవైపు యూపీలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ కుదిరింది. యూపీలోని 80 స్థానాల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కి లభించిన సీట్లలో అమేథీ, రాయ్‌బరేలీ కూడా ఉన్నాయి.