బీహార్‌లో 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తాజాగా తెలిసింది. అతడు పాకిస్థాన్ జైలులో బందీగా ఉన్నట్లు సమాచారం అందడంతో సదరు వ్యక్తి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… బీహార్‌లోని బక్సర్ జిల్లా ఖిలాఫత్‌పూర్‌కు చెందిన ఛావీ అనే వ్యక్తి 12 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో అతడి వయసు 18 సంవత్సరాలు. అంతేకాదు అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదు. అయితే అతడి కోసం కుటుంబసభ్యులు పోలీసులకు…
బహిరంగ ప్రదేశాలలో నమాజ్ అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ప్లేస్‌లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను సహించేది లేదన్న హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటన వివాదాస్పదమైంది. గురుగ్రామ్‌లో ముస్లింలకు గతంలో కేటాయించిన ప్రార్థనా ప్రదేశాలన్నిటిని హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిర్దేశిత ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేయటాన్ని ఆర్ఎస్ఎస్ సహ హిందూ సంస్థల కార్యకర్తలు అడ్డుకోవటం ఈ నిర్ణయానికి దారితీసింది. ఐతే, ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖట్టర్ నిర్ణయంపై…
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించిన ఇద్దరు యువకుల చేత నేలపై ఉమ్మిని నాకించిన ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని సింఘనా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పంచాయతీ ఎన్నికల్లో సింఘానా గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న బల్వంత్ సింగ్ అనే వ్యక్తి తనకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించాడు. అయితే ఇద్దరు యువకులు మాత్రం బల్వంత్ సింగ్‌కు ఓటు వేసేందుకు నిరాకరించారు. దీంతో బల్వంత్ సింగ్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. Read Also:…
ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు… ఇవాళ తన బాల్య స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి యాదవ్.. ఢిల్లీలో తేజస్వి యాదవ్-రాచెల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది… ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు.. కరోనా నేపథ్యంలో.. ఈ వేడకకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.. ఇక, ఈ వివాహ వేడుకకు యూపీ మాజీ సీఎం…
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్‌వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే…
అక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది.. బంధువులు, స్నేహితులు పెళ్ళిలో అటుఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.. వధువు.. తన కొత్త జీవితం గురించి కళలు కంటూ వరుడు కోసం ఎదురుచూస్తుంది. అంతలోనే బ్యాండ్ బాజా భారత్ తో వరుడు కారులో వచ్చేశాడు. అతను రావడం .. వధువుకు తాళికట్టడంతో పెళ్లి ముగిసేది.. కానీ, విధి వారి జీవితాన్ని మరోలా రాసింది. కారు నుంచి దిగిన వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెళ్లి హడావిడి వలన కుప్పకూలాడేమో అనుకోని హాస్పిటల్ కి…
మొన్నటి రోజున రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం విధిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మరుసటి రోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఇప్పుడు దేవాలయాల ఆదాయంపై నాలుగు శాతం పన్నులు చెల్లించాలని బీహార్ బోర్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది సొంత…
బీహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన మరుసటి రోజే, ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయని మండిపడిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఇక ఈ సంఘటనపై సీఎం నితీశ్ కుమార్…
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం.. అయితే, కొన్ని సార్లు నేతలు చేసిన కామెంట్లు, ఆరోపణలు సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలే చేశారు.. నితీష్ కుమార్ కూడా గంజాయి తాగుతారు. ఇది మత్తు కేటగిరి కిందకు వస్తుంది.. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగం కూడా నిషేధించబడింది.. కానీ, ఆయన గంజాయి వ్యసనాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు అవుతోన్న మద్యపాన నిషేధంపై…