Fodder Scam: నేను నిరాకరించా.. ఆయన మనుషులే లాలూపై కేసు పెట్టారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.. దాణా స్కామ్‌కు సంబంధించిన ఐదో కేసులో లాలూని దోషిగా తేల్చిన కోర్టు… ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్… ఆయనపై కేసులు పెట్టింది మేం కాదన్న ఆయన.. ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే పెట్టారని విమర్శించారు.. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఉన్నవారే ఆయనపై కేసులు పెట్టారన్నారు నితీష్ కుమార్.. ఇక, లాలూపై కేసులు పెట్టినవారు తన వద్దకు కూడా వచ్చారని.. కానీ, మేం నో చెప్పామన్నారు. కేసులు పెట్టాలనుకుంటే మీరు ఆ పని చేసుకోవచ్చు.. తన పని మాత్రం అది కాదని వారితో చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు నితీష్ కుమార్.
Read Also: Payyavula Keshav: సీఎం జగన్‌కు పయ్యావుల లేఖ
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
కాగా, 1990లలో దాణా కుంభకోణం జరిగింది.. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసులు నమోదు చేశారు.. ఆ సమయంలో బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే కాగా.. అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నారు.. దీంతో, ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు లాలూ… దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!