సర్పంచ్ అంటే ఊరిలోని ప్రజలందరికీ రక్షణగా నిలవాల్సిన వ్యక్తి.. కానీ, అతడే వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఒకే కుటుంబంలోని ముగ్గురు బాలికలను వేధింపులకు గురిచేశాడు.. ఇక, తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోసిన దారుణమైన ఘటన బీహార్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్ జిల్లా లోధ్‌లో గ్రామ సర్పంచ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ముగ్గురు యువతులు ఆరోపించారు. అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన సర్పంచ్ ఓ అమ్మాయి ముక్కు కోయడం సంచనంగా మారింది.. ఊహించని ఘటనతో షాక్‌తిన్న ఆ కుటుంబం.. తెరుకొని.. వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించింది.. ఈ ఘటనపై సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.. సర్పంచ్ ముస్తాకిన్.. తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. మరోవైపు, తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ.. పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు సర్పంచ్.. కేసులు నమోదు చేసిన పోలీసుల.. రెండు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Read Also: Telangana: ప్రభుత్వ ప్రకటనతో కొత్త ఆశలు.. వారంతా సిటీకి క్యూ..!