ఇంటిని నిర్మించుకోవాలి అంటే కనీసం రెండు నుంచి నాలుగు సెంట్ల స్థలం అవసరం అవుతుంది. నాలుగు సెంట్ల స్థలంలో ఓ మాదిరి ఇంటిని నిర్మించుకోవచ్చు. అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ, బీహార్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన సంతోష్ అనే తనకున్న ఆరు అడుగుల స్థలంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవున్న స్థలంలో మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడు. తనకు తెలిసిన తాపీ మేస్త్రీని సంప్రదించాడు. ప్లాన్ రూపొందించుకున్నారు. 6 అడుగుల స్థలంలో అదిరిపోయే విధంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. ఈ భవనానికి ముందు మెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి గదిని 5 అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు ఉండేలా ఏర్పాటు చేశారు. నాలుగు అంతస్తుల ఈ భవనం ఒంటిస్తంభం మేడలా ఉండటంతో ఆకట్టుకుంటున్నది.
Read: Google: 50 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్… కానీ చివరకు…