కల్తీ కల్లు, కల్తీ మద్యం సేవించి ప్రాణాలు విడిచిన ఘటనలు ఇంకా అక్కడక్కడ వెలుగు చూస్తేనే ఉన్నాయి.. తాజాగా బీహార్‌లో కల్తీ మద్యం తీవ్ర కలకలం సృష్టించింది.. రెండు వేర్వేరు ఘటనల్లో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తేం.. కల్తీ మద్యం కాటుకు గోపాల్‌గంజ్ జిల్లాలో 16 మంది మృతి చెందారు. ఇక, వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో మరో ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు..…
పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టానుసారం పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను దోపీడి చేస్తున్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పెట్రోల్, డిజీల్ పై లీటర్ ధరపై కేంద్రం రూ.5, రూ.10 తగ్గించి బీజేపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. లీటర్పెట్రోల్పై రూ.50 తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే దేశ ప్రజలకు మేలు జరుగుతందని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే యూపీలో ఎన్నికలు పూర్తవ్వగానే కేంద్రం మళ్లీ…
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ పరీక్షలు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకు కరెంట్ సమస్యలు వంటివి తలెత్తకుండా ఉండాలి. అప్పుడు వారి విద్య సాఫీగా సాగుతుంది. బీహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆ రాష్ట్రం ఎన్నో రకాలుగా వెనబడి ఉన్నది. కానీ, ఇప్పుడు కొంతమేర అభివృద్ది చెందింది. కానీ, కొన్ని గ్రామాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. గ్రామాల్లో ఎప్పుడు…
ఇప్పుడున్నది డిజిటల్ యుగం. ఇళ్లు కదలకుండానే ఒక్క క్లిక్కుతో అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఆఖరికి గుండుసూది కావాలన్నా ఆన్ లైన్లోనే బుక్ చేసే రోజులు వచ్చాయి. ఆన్ లైన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి చెడులను బేరీజు వేసుకొని ఇంటర్నెట్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇక బ్యాంకులు మొత్తం డిజిటలేజేషన్ అయిపోయిన తర్వాత జనాలు బ్యాంకులు వెళ్లడం తగ్గిపోయింది. తమ అకౌంట్లో పైసలు పడగానే ఏటీఎంలు వెళ్లి…
బీహార్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అంటే అంతా అవుననే సమాధానమే విస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి గెలిచింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ గెలువాల్సి ఉంది. కానీ చావుతప్పి కన్నులొట్టబోయినట్లు బీజేపీ, జేడీయూ కూటమి విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌లో ప్రస్తుతం బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలో ఉండగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. అయితే ఈ కూటమిపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ సీఎం.. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా ఉన్న సదానంద్ సింగ్ కన్నుమూశారు… ఆయన బుధవారం ఉదయం మృతిచెందినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించారు.. ఇక, బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలోని కహల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్… తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సదానంద్ సింగ్ 2000 నుండి 2005 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా కూడా ఉన్నారు. అంతకుముందు అతను బీహార్ నీటిపారుదల మరియు ఇంధన…
దేశంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వర్షాలు బీహార్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. దీంతో సామాన్యప్రజలతో పాటుగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా గత విద్యాసంవత్సంలో పాఠశాలలు జరగలేదు. గత నెల రోజుల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. స్కూళ్లు ప్రారంభమైన కొన్ని రోజులకే వరదలు ముంచెత్తడంతో ఉపాద్యాయులు పడవల్లోనే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. కతియార్ జిల్లాలోని మహనీహరి ప్రాంతంలో ఉపాద్యాయులు పడవల్లోనే విద్యను బోధిస్తున్నారు.…
ఓ ఎమ్మెల్లే బీహార్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అలా ట్రైన్‌లోకి ఎక్కిన తరువాత ఆయన హఠాత్తుగా అండర్వేర్, బనియన్ వేసుకొని బోగీలో తిరుగుతూ కనిపించారు. వెంటనే తోటి ప్రయాణికులు ప్రశ్నించగా ఆయన విచిత్రమైన సమాధానం చెప్పారు. తనకు కడుపు ఉబ్బరంగా ఉందని, వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తున్నానని సమాధానం చెప్పారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా తిరిగితే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నించారు. అనంతరం ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వోకు ఫిర్యాదు చేశారు.…
బీహార్ రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ నితీష్ కుమార్ కీలక భూమిక పోషించారు.. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. రెండు దఫాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్నారు.. అయితే, ప్రధానికి కావాల్సిన అర్హతలన్నీ నితీష్ కుమార్‌కు ఉన్నాయంటూ.. జేడీయూ పార్లమెంటరీ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది.. దీంతో.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ప్రధాని రేసులో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.. ఈ…
రాఖీ పండగ రోజున బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల మన్మోహన్ అనే యువకుడు పాములు పట్టడంలో నేర్పరి. తాను నివశించే చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు పట్టుతుంటాడు. అయితే, అందరిలా రాఖీ పండుగనే చేసుకుంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు. రెండు పాములకు రాఖీలు కట్టాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రెండు పాములను పట్టుకున్నాడు. వాటి తోకలను పట్టుకొని పడగపై బొట్టు పెట్టాడు. అయితే, అందులో ఒకపాము మెల్లిగా కదులుతూ ముందుకు వచ్చింది. కానీ దానిని…