అపాయం కలిగినపుడే ఉపాయం ఆలోచించాలి. మెదడు షార్ప్‌గా పనిచేయాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్రమాదంలో చిక్కకున్నామని తెలిసిన వెంటనే ఏం చేయాలో తెలియక కాళ్లు చేతులు వణికిపోతాయి. ఆ సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. పొంచిఉన్న ప్రమాదం దూరంగా ఉన్నప్పటికీ దగ్గరికి వచ్చేస్తుందని భావించి తప్పించుకోలేక దానికి చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంటాము.
Read: Russia-Ukraine War: భయాందోళనలో ఉక్రెయిన్ ప్రజలు… రష్యా ఆ బాంబును ప్రయోగిస్తుందా?
అయితే, బీహార్‌లోని పాట్నాకు చెందిన ఓ వ్యక్తి ధైర్యంగా, సమయస్పూర్తితో వ్యవహరించి వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాట్నా రైల్వేస్టేషన్‌లో రైలుకోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి రైలు ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేముందు కాలుజారి కిందపడ్డాడు. రైలు పట్టాలపై పడటం, దూరం నుంచి రైలు దూసుకురావడంతో ఆ వ్యక్తి సమయస్పూర్తితో వ్యవహరించి రైలు పట్టాలపై బోర్లా పడుకుండిపోయాడు. రైలు వెళ్లిపోగానే ఆ వ్యక్తి మెల్లిగా లేచి బయటకు వచ్చాడు. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న వ్యక్తులు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.