హెలికాఫ్టర్‌లో తిరగాలని ఎవరికైనా ఉంటుంది. రైళ్లు, బస్సులలో తిరగడం అంటే కామన్ అయింది. అయితే, విమానాలు, హెలికాఫ్టర్‌లో తిరగాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో వధూవరులను హెలికాఫ్టర్‌లో తీసుకురావాలని అనుకుంటారు. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనీసం అలా వెళ్లాలి అనుకునే వారికోసం ఎదైనా చేయాలని అనుకున్నాడు బీహార్‌కు చెందిన మెకానిక్, ఆర్టిస్ట్ అయిన గుండు శర్మ. తన వద్ద ఉన్న నానో కారుకు హెలికాఫ్టర్‌గా…
ఇంటిని నిర్మించుకోవాలి అంటే కనీసం రెండు నుంచి నాలుగు సెంట్ల స్థలం అవసరం అవుతుంది. నాలుగు సెంట్ల స్థలంలో ఓ మాదిరి ఇంటిని నిర్మించుకోవచ్చు. అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ, బీహార్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన సంతోష్ అనే తనకున్న ఆరు అడుగుల స్థలంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవున్న స్థలంలో మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడు. తనకు తెలిసిన తాపీ మేస్త్రీని…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. ఒకటి రెండు ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత చాలా మంది మనకు ఉద్యోగం రాదేమో అని చెప్పి వెనకడుగు వేస్తుంటారు. ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది. దీనిని ఎంతోమంది నిరూపించారు. తాజాగా సంప్రీతీ యాద్ అనే 24 ఏళ్ల యువతి మరోసారి దినిని రుజువుచేసింది. Read: Lockdown Effect:…
సాధారణంగా వంతెనలు అంటే సిమెంట్, లేదా స్టీల్‌తో నిర్మిస్తుంటారు. రోడ్డును దాటేంగుకు పాదచారుల కోసం చాలా ప్రాంతాల్లో ఐరన్, స్టీల్‌తో నిర్మించిన వంతెనలు కనిపిస్తుంటాయి. వాహనాలు ప్రయాణం చేసేందుకు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు. ఇవి అన్ని చోట్ల ఉండేవే. కానీ, కొన్ని వంతెనలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. అలాంటివే గ్లాస్ వంతెనలు. వంతెనలను గ్లాస్‌తో నిర్మిస్తారు. ఇలాంటివి దేశంలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి సిక్కింలో ఉన్నది. సిక్కింలోని పెల్లింగ్ నగరంలో ఈ గ్లాస్…
కవితకు కాదేది అనర్హం అని శ్రీశ్రీగారు చెప్పినట్టుగా దోచుకోవడానికి దొంగలకు కాదేది అనర్హం అంటున్నారు బీహార్ దొంగలు. బీహార్‌లోని డెహ్రీ పట్టణంలో చారిత్రాత్మకమైన సూర్య గడియారాన్ని దొంగలు దోచుకుపోయారు. 1871లో బ్రిటీష్ పరిపాలన కాలంలో డెహ్రీ పట్టణంలో ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారు. చారిత్రాత్మకమైన ఈ గడియారం ఉన్న ప్రాంతం చుట్టూ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫీసులు ఉన్నాయి. నిత్యం ప్రజలు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు. అంతేకాదు, జిల్లా జెడ్జి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సబ్ డివిజినల్…
వరంగల్ రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి ప్లాట్ ఫాం పైకి పడిన యువకుడు కాసేపట్లో పట్టాలపై పడే ప్రమాదం నుంచి కాపాడిన వరంగల్ రైల్వే పోలీసుల్ని పలువురు అభినందిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లలో కదులుతున్న రైల్ నుండి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి పడిపోయాడు బీహార్ యువకుడు. అతడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు రైల్వే పోలీసులు. బీహార్ కు చెందిన ప్రార్థన కుమార్ వరంగల్ నుండి…
దేశం సాంకేతికంగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. డిటిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు క్యాష్ ను క్యారీ చేయడం లేదు. ఏది కావాలన్నా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీధిలో ఉండే బెగ్గర్లు అవస్థలు పడుతున్నారు. ఎవర్ని అడిగినా డబ్బులు లేవని చెబుతుండటంతో వారు కూడా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవుతున్నారు. పేటీఎం, ఫోన్‌పే తదితర డిజిటల్ పేమెంట్ బోర్డులను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా చిల్లర లేదని అంటే…
ఫిబ్రవరి 10 వ తేదీన ఆర్జేడీ కార్యనిర్వాహక సమావేశం జరగనున్నది. ప్రతి ఏడాది పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జరుగుతున్న మార్పులపై చర్చిస్తారు. ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటం చేయాలో పార్టీలో చర్చిస్తుంటారు. అయితే, దాణా కుంభకోణం కేసులో మొన్నటి వరకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక, 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో లాలూ చిన్నకొడుకు తేజశ్వీ యాదవ్ నేతృత్వంలో…
బీహార్‌లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను…
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…