Nitish kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ హా అన్ని ప్రతిపక్షాలు చేతులు కలపాలని కోరారు. యునైటెడ్ ఫ్రంట్ బీజేపీని 100 కన్నా తక్కువ సీట్లకు పరిమితం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు హాజరైన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Crime News: తల్లిదండ్రులు తమ కొడుకుకు మంచి సంబంధం చూశారు. పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. అప్పటివరకు ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్న యువకుడు స్వదేశానికి రావడంతో కుటుంబసభ్యులు పెళ్లి హడావుడిలో నిమగ్నమయ్యారు.
Nitish Kumar: తనకు ప్రధాన మంత్రి కావాలనే కోరిక లేదని అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 2024లో ప్రధాని కావాలనే కోరిక లేదని.. తన కోసం నినాదాలు చేయవద్దని తన పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించారు. అంతకుముందు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కోరికను బయటపెట్టారు. ఆయన కోరికను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. రోబోయే ఎన్నికల్లో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంపై తాను దృష్టిపెట్టానని నితీష్ కుమార్ అన్నారు.
Cruel Father: బీహార్లో దారుణం చోటుచేసుకుంది. రూ.10కోసం ఆరేళ్ల బాలికను తండ్రి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లాలోని పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామోన్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 10న బీహార్లోని భాగల్పూర్ పర్యటనకు ముందు ఐఎస్ఐ, నక్సలైట్లు, ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ తెలిపారు.
Phulwari Sharif PFI case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పీఎఫ్ఐ ఉగ్రసంస్థ ఫుల్వారీ షరీఫ్ కేసులో మరో ఇద్దరిని బీహార్ లో అరెస్ట్ చేశారు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పిఎఫ్ఐకి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బహదూర్పూర్ గ్రామానికి చెందిన తన్వీర్ రజా అలియాస్ బర్కతి, మహ్మద్ అబిద్ అలియాస్ ఆర్యన్ అనే ఇద్దరు వ్యక్తులను మోతిహరీ ప్రాంతంలో ఎనిమిది చోట్ల దాడులు చేసి అరెస్ట్…
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.
బీహార్లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు.
Pathan Movie Row: ‘‘ ఫిల్మ్ చలేగా హాల్ జలేగా(సినిమాను ప్రదర్మిస్తే, సినిమా హాల్ తగలబడుతుంది)’’ అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ లో పఠాన్ సినిమానున ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద హల్చల్ చేశారు. విడుదలకు ముందే పఠాన్ సినిమా పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగల్ పూర్ లోని దీప్ ప్రభ థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం సినిమా హాల్ వెలుపల పఠాన్…