lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు.
ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి దేశ రాజధానిలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు నిర్వహించింది.
Partner Exchange : కొన్ని సంబంధాలు వింటుంటే వింతగా అనిపిస్తుంటాయి. ఒక్కోసారి అవసరాలే ఇలాంటి విచిత్ర బంధాలను సృష్టిస్తాయేమో.. బీహార్లో మాత్రం అలాగే జరిగింది.
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
Nitish Kumar: బీహర్ సీఎం ముఖ్య అతిథిగా హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగం చేస్తున్న ఓ వ్యవసాయ పారిశ్రామికవేత్తను సీఎం నితీష్ కుమార్ వారించారు. తన జీవిత ప్రయాణాన్ని, తన విజయాల గురించి చెబుతూ అమిత్ కుమార్ అనే వ్యక్తి ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రప్రభుత్వం ‘నాలుగో వ్యవసాయ రోడ్ మ్యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పాట్నాలోని బాపు సభాగర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.
Ravi Shankar Prasad: ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ…
Bihar jail inmate swallows mobile phone: బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ డివిజన్ జైలులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మింగేశారు. జైలులో పోలీస్ అధికారులు తనిఖీ చేస్తుండటంతో, తన దగ్గర ఉన్న ఫోన్ దొరుకుతుందనే భయంతో మింగేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇది జరిగిన కొంత సేపటికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఖైదీని ఆస్పత్రికి తరలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Woman writes Class 10 exam hours after giving birth to son: బీహార్ లో ఓ మహిళ చదువుకోవాలనుకుంటున్న వారికి స్పూర్తిగా నిలుస్తోంది. బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ ఘటన బుధవారం రోజు బీహార్ లోని బంకాలో చోటు చేసుకుంది. కొడుకు జన్మించిన తర్వాత మూడు గంటల్లోనే పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్ రాసింది. పరీక్ష రాయాలనే ఆమె సంకల్పాన్ని ప్రసవవేదన కూడా కదిలించలేకపోయింది. పురిటి నొప్పుల…