Former Union Minister Sharad Yadav Dies At 75: ప్రముఖ సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి, జేడీయూ వ్యవస్థాపక సభ్యుడు శరద్ యాదవ్(75)కన్నుమూశారు. చాలా కాలంగా శరద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఢిల్లీలో తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి శరద్ యాదవ్ అపస్మారస్థితిలోకి వెళ్లారు. పల్స్ లేకపోవడంతో సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన…
Nitish Kumar comments on population: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనాభా నియంత్రణ, మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. మహిళలు చదువుకోకపోవడం, పురుషులు అజాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణలోకి రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. శనివారం జేడీయూ నిర్వహిస్తున్న సమాధాన్ యాత్రలో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన గురువే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. మైనర్ విద్యార్థుల అసభ్యకరమైన వీడియోలను క్యాప్చర్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు నవాడాకు చెందిన మదర్సా ఉపాధ్యాయుడిని బీహార్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
Nitish Kumar comments on Rahul Gandhi's Prime Ministerial candidacy: 2024 ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ప్రశ్నలు వస్తున్నాయి. చాలా మంది నేతలు ప్రధాని పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్, మమతాబెనర్జీ వంటి నేతలు ప్రధాని ఆశల్లో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని…
గత 40 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన మహిళను ఉన్నత పదవికి ఎన్నుకోవడం ద్వారా బీహార్‌లోని గయాలో జరిగిన పౌర సంస్థల ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గయా డిప్యూటీ మేయర్‌గా చింతాదేవి ఎన్నికయ్యారు.
RJD leader Abdul Siddiqui on Muslims feeling insecure in India: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. బీహార్ మాజీ మంత్రి అయిన సిద్ధిఖీ.. తన కొడుకు, కూతుర్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని, వీలైతే అక్కడే పౌరసత్వం కూడా ఇప్పించాలని కోరానని సిద్ధిఖీ అన్నారు.
Bridge Collapses: కొన్ని బ్రిడ్జ్‌లు ఏళ్లు గడిచినా.. చెక్కు చెదరకుండా ఉంటాయి.. మరికొన్ని కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకుండానే కుప్పకూలిన సందర్భాలు ఉంటాయి.. అలాంటి ఘటనే ఇప్పుడు బీహార్‌లో జరిగింది.. బెగుసరాయ్‌లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన… నిన్న కుప్పకూలింది. బ్రిడ్డ్ ముందు భాగం కూలి నదిలో పడిపోయింది.. అయితే, ఆ బ్రిడ్జి ఇంకా ప్రారంభించలేదు.. ముందే ఇలా జరగడంతో అంతా షాక్ తిన్నారు.. అయితే, అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత…
Prashant Kishore criticizes Bihar Deputy CM Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. సొంత రాష్టమైన బీహార్ లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ఆయన తేజస్వీ యాదవ్ ని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించారు. బీహార్ వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్( సీటెట్)కి అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా…