సీరియల్ కిల్లర్స్ గురించి వినే ఉంటారు.. అంటే వరుసగా మర్డర్లు చేస్తుంటారు.. హత్య చేసి అక్కడి నుంచి పరార్ అవుతాడు.. కానీ సీరియల్ కిస్సర్ ను చూశారా? కనీసం అలాంటి పేరు అయిన విన్నారా?.. నిజం వాడో సీరియల్ కిస్సర్.. వాటీ టార్గెట్ మహిళలే. ఎక్కడి నుంచి వస్తాడో.. ఎలా వస్తాడో.. ఎప్పుడు వస్తాడో తెలియదు.. సడెన్ గా వెనుక నుంచి వస్తాడు.. గట్టిగా పట్టుకుంటాడు.. బలవంతంగా పెదలపై ముద్దు పెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అవుతాడు.
Also Read : ‘O Saathiya’: అంచనాలు పెంచుతున్న మెలోడీ సాంగ్!
బీహార్ లో ఓ సీరియస్ కిస్సర్ వ్యవహారం కలకలం రేపుతుంది. జమై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి.. స్థానిక మహిళలను బెంబేలెత్తిస్తున్నాడు. వెనుక నుంచి వచ్చి బలవంతంగా ముద్దు పెట్టి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అక్కడి మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సదరు సీరియల్ కిస్సర్. శుక్రవారం మధ్యాహ్నం ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జమై సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ మహిళ మధ్యాహ్నం ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఆమె ఫోన్ లో మాట్లాడటంలో నిమగ్నమైంది. ఇంతలో ఓ వ్యక్తి సడెన్ గా ఆమె వెనుక నుంచి వచ్చి.. ఆమె చూసే లోపు గట్టిగా పట్టుకుని ఆ తర్వాత బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ షాక్ కి గురైంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Allu Arjun: ఆర్ఆర్ఆర్ పై బన్నీ ప్రశంసల వర్షం.. అందరి చూపు ఆ ఒక్క మాటమీదే
సీరియస్ కిస్సర్ వ్యవహారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా మహిళలు.. ఒంటరిగా రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంక్వైరీ చేసి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ దుండగుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలు జమై సర్ధార్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆస్పత్రి బయట నిల్చుని ఫోన్ లోమాట్లాడుతుండగా.. బలవంతంగా ముద్దు పెట్టడంతో షాక్ కి గురైంది. కాగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆస్పత్రి గోడ దూకి మహఇళ దగ్గరికి వచ్చాడు.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీరియల్ కిస్సర్ ను వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.