మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ అకిల్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. తగులబెట్టి.. భోపాల్‌లోని డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగింది. కాగా.. భర్త నదీమ్ ఉద్దీన్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం.. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(Kamal Nath) బీజేపీలో (BJP) చేరుతున్నారంటూ గత వారం జోరుగా ప్రచారం జరిగింది.
భోపాల్‌లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్‌ను మధ్యప్రదేశ్‌లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.
Stray Dogs Attack: విధికుక్కులు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఏడు నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణం తీశాయి. ఈ ఘటన బుధవారం నగరంలోని అయోధ్య నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
Girls Missing: మధ్యప్రదేశ్ 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాజధాని భోపాల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ అక్రమ షెల్టర్ హోమ్ నుంచి గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. బాలికల్లో ఎక్కువగా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌లకు చెందిన వారు కాగా.. కొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్‌లకు చెందిన వారు ఉన్నారు.
Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ)కి చెందిన కమలేశ్వర్ దొడియార్ తొలిసారి విజయం సాధించారు. రత్లాం జిల్లాలోని సైలానా నుంచి ఆయన గెలుపొందారు.
Digvijay Singh: మధ్యప్రదేశ్ ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదం పెరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ బాజ్పాయ్పై సమాచార, సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.