Congress Leader Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..
- మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ కా అకిల్ కన్నుమూత
- చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆరిఫ్
- 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
- భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులకు సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ అకిల్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో.. అతను రెండుసార్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి చేశారు. మైనారిటీ సంక్షేమం, జైళ్లు, ఆహార శాఖ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఆరిఫ్ అకిల్ 1990లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆరిఫ్ అకిల్ తన కొడుకు అతిఫ్ అకిల్ ను భోపాల్ నార్త్ సీటు నుంచి 2023లో బరిలో నిలిపారు. అతిఫ్ అకిల్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
READ MORE: Teacher Sleeping In School: ఈ టీచరమ్మ రూటే సపరేటు.. నిదురపోతున్న ఆమె పిల్లలతో? (వీడియో)
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులకు సాయం..
1984లో భోపాల్‌లో జరిగిన యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత ఆరిఫ్ అకిల్ ప్రజల్లో తన ఇమేజ్‌ను పెంచుకోగలిగారు. ఫ్యాక్టరీకి కొంత దూరంలో ఆరిఫ్ నగర్ అనే పట్టణాన్ని స్థాపించారు. గ్యాస్ దుర్ఘటన బాధితులు, వారి కుటుంబాలు ఈ స్థలంలో స్థిరపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. భోపాల్ నార్త్ సీటులో దాదాపు 54 శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. అయితే సింధీ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు కూడా మంచి సంఖ్యలో ఉన్నారు. ప్రతిసారి వీరు ఆయన మద్దతుగా నిలిచి గెలిపించారు. ఆరిఫ్ నగర్ లో గ్యాస్ దుర్ఘటన బాధితులు నివసిస్తుంటారు. అది పెద్ద మురికి వాడగా చెబుతారు. అక్కడ సరైన వసతులు కల్పించాలని ఆరిఫ్ నిరంతరం కొట్లాడుతూ.. వచ్చారు. ఆయన మరణవార్తతో ఆరిఫ్ నగర్ మూగబోయింది.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!