మంచి నీళ్లు తాగినంత ఈజీగా విడాకులు కోరుతున్నారు కొందరు భార్యలు. వింతైన కారణాలు చెబుతూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భార్యాభర్తల మధ్య ఒక వింత కేసు వెలుగుచూసింది. తన భార్యను సబ్-ఇన్‌స్పెక్టర్‌గా చేయడానికి భర్త అవిశ్రాంతంగా కృషి చేశాడు. అయితే, ఆమె ఎస్ఐ అయిన వెంటనే, భర్త వేషధారణ, అతడు చేసే వృత్తిని చూసి భార్య ఇబ్బంది పడటం ప్రారంభించింది. Also Read:Pakistan Army Terror Links: ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ…
భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేతతో సహా సహచర భారత నేవీ కయాకర్ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేరాలను అరికట్టాల్సిన ఖాకీనే కిలాడీగా మారింది. చేసేది పవర్‌ఫుల్ ఉద్యోగం.. బుద్ధేమో కంత్రీ బుద్ధి. స్నేహితురాలి ఇంటికొచ్చి ఆమె ఇంటికే కన్నం వేసింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
90 Degree turn Bridge: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముందే.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు.
Bhopal: భోపాల్‌కి చెందిన ఎస్ఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. జిమ్ యజమానుల సమావేశంలో ఎస్ఐ దినేష్ శర్మ మాట్లాడుతూ.. ముస్లిం ట్రైనర్లు, శిక్షణ తీసుకోవడానికి వచ్చే వారిని జిమ్‌లోకి అనుమతించకూడదని జిమ్ యజమానులకు సూచించాడు. వీడియోలో ‘శిక్షణ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఏ ముస్లిం ఇక్కడకు రాడు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమారుడు లిఫ్ట్ ఎక్కగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భయాందోళనకు గురై ఏడ్వడం మొదలుపెట్టాడు. దీంతో బిడ్డకు ఏమైందో ఏమోనని ఆ తండ్రి కంగారు పడ్డాడు.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్‌మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్‌తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
ఈ మధ్య భార్యాభర్తల సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. కలకాలం తోడుండాల్సిన భాగస్వాములను అర్థాంతరంగా వదిలించుకుంటున్నారు.
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
భోపాల్‌లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.